Header Banner

టెన్త్ స్టూడెంట్స్‌కు ఏపీ ఆర్టీసీ గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్ష కేంద్రాలకు ఇక టెన్షన్ ఫ్రీ!

  Sat Mar 08, 2025 14:28        Education

ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పదో తరగతి పరీక్షల వేళ ట్రాఫిక్ రద్దీ, దూర ప్రాంతాల్లో ఉండే పరీక్ష కేంద్రాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అనుమతించాలని నిర్ణయించింది. తద్వారా వారు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు వీలు కలుగుతుందని ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 17 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నెలాఖరు వరకూ జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.49 లక్షల మంది విద్యార్ధులు హాజరవుతున్నారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!


వీరి కోసం ప్రభుత్వం 3450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటికి చేరుకునేందుకు ఆయా విద్యార్ధులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. పరీక్షా కేంద్రానికి వెళ్లడంతో పాటు తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని తెలిపింది. అయితే ఆర్టీసీకి చెందిన పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఇలా పదో తరగతి విద్యార్ధులను టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణానికి అనుమతిస్తారు. బస్సు ఎక్కాక విద్యార్ధులు తమ హాల్ టికెట్ ను కండక్టర్ కు చూపిస్తే సరిపోతుంది. అలాగే తిరుగు ప్రయాణంలోనూ ఇలాగే చేస్తే సరిపోతుంది. ఈ మేరకు విద్యాశాఖతో పాటు ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఈ సౌకర్యాన్ని పదో తరగతి విద్యార్ధులు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #10thexams #10thstudents #freebus #todaynews #flashnews #latestnews